రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్, రజిత ఆధ్వర్యంలో కొదురుపాక, విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ సి డి( బిపి, షుగర్, క్యాన్సర్) లాంటి వ్యాధుల నమోదు ప్రక్రియ లక్ష్యాలు సాధించాలని రికార్డులను పరిశీలించారు.
టీబీ, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై లక్ష్యాలు సాధించాలని ఈ సందర్భంగా వైద్యాధికారులకు సూచించినారు.ఈ కార్యక్రమంలో కొదురుపాక వైద్యాధికారిని డాక్టర్.రేణు ప్రియాంక, విలాసాగర్ వైద్యాధికారిని డాక్టర్.అనిత, డిప్యూటీ డెమో రాజకుమార్, సిహెచ్ఓ సత్యనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.