బోయినిపల్లి మండలంలో ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్, రజిత ఆధ్వర్యంలో కొదురుపాక, విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ సి డి( బిపి, షుగర్, క్యాన్సర్) లాంటి వ్యాధుల నమోదు ప్రక్రియ లక్ష్యాలు సాధించాలని రికార్డులను పరిశీలించారు.
టీబీ, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై లక్ష్యాలు సాధించాలని ఈ సందర్భంగా వైద్యాధికారులకు సూచించినారు.
ఈ కార్యక్రమంలో కొదురుపాక వైద్యాధికారిని డాక్టర్.రేణు ప్రియాంక, విలాసాగర్ వైద్యాధికారిని డాక్టర్.
అనిత, డిప్యూటీ డెమో రాజకుమార్, సిహెచ్ఓ సత్యనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ