పట్టపద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించండి - సర్దార్ రవీందర్ సింగ్

2025 మార్చి నెలలో జరిగే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.మంగళవారం వేములవాడ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను కలిసి ఓటు అభ్యర్థించిన ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయానని, పట్టభద్రుల హక్కులకై మండలిలో పోరాడుతానని,న్యాయవాదిని అయిన నన్ను గెలిపించాలని న్యాయవాదులను కోరారు.

 Let Me Win In Mlc Elections Sardar Ravinder Singh, Mlc Elections, Sardar Ravinde-TeluguStop.com

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల గౌడ్, పొత్తూరు అనిల్ కుమార్, విద్యాసాగర్ రావు, కొడిమ్యాల పురుషోత్తం, పెంట రాజ్ కుమార్, కందుల క్రాంతి కుమార్,శ్రీనివాస్ , కటకం జనార్ధన్, బొడ్డు గంగరాజు, బొజ్జ మహేందర్, గుడిసె సుదర్శన్ ,బొజ్జ నరేష్, సాగరం శ్రీధర్ తదితరులున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube