రాజన్న సిరిసిల్ల జిల్లా :సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ఎకరాకు 15 వేల రైతు భరోసాను ఇస్తానన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా రాస్తా రోకో నిర్వహించారు.బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ పిలుపు మేరకు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట అగయ్య ఆధ్వర్యంలో సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ రామచంద్రం కు మెమొరాండం సమర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి చీటి లక్ష్మణ్ రావు తో పాటు మండలంలోని పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు ,రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎకరా 15000 రైతు భరోసా కింద అందజేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు.ఈ నిరసనలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ కదిర భాస్కర్ , మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.