రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని వేములవాడ బిఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.పట్టణంలోని తెలంగాణ చౌక్ లో మంగళ వారం వారు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నప్పటికీ రైతులను మోసం చేస్తూ కాలం వెలదీస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికల సందర్భంగా అధికారం కోసం అసత్య ప్రకటనలు, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకుని ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు.
రైతు భరోసా ప్రతి ఎకరానికి 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతన్నల సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని రైతు సమాజానికి భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయని యెడల రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు గోలి మహేష్, నరాల శేఖర్,సెస్ మాజీ డైరెక్టర్ రామతీర్థపు రాజు,గడ్డం హనుమాన్లు, బాల్రెడ్డి అంజని కుమార్ కటక మల్లేశం శ్రీకాంత్ గౌడ్, తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, అంజద్ పాషా,పసుల ఆంజి ,పిట్టల వెంకటేష్ యామ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.