రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కిడ్నాప్ కు గురైన బాలిక కేసును ఎట్టకేలకు చేదించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు.జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య అనే దంపతులు ఇద్దరు కుతురులు ఉండగా,లాస్యకు మతిస్థిమితం కారణంతో భర్తతో వ్యక్తిగత కారణాలవల్ల గత కొద్దిరోజులుగా దూరంగా ఉంటుంది.లాస్య తన కూతురు సింగారపు అద్విత (4) రాజన్న దర్శనానికి వేములవాడ వచ్చి ఇక్కడే ఉండగా మహబూబాద్ కి చెందిన ముగ్గురు మహిళలు వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానానికి రాగా లాస్యతో చనువు ఏర్పడి అందరు కలిసి దాదాపు 5 రోజులుగా వేములవాడ గుడి ఆవరణలో నిద్ర, మొక్కులు తీర్చుకున్నారు.
ఈక్రమంలో పాప వాళ్ళ తల్లి మతిస్థిమితం కారణంతో పాపను సరిగా చుసుకోవడం లేదని గ్రహించిన ముగ్గురు అనుమానిత మహిళలు పాపని దగ్గరకి తీసుకొని పరిచయం పెంచుకొని నమ్మించారు.
పాప యొక్క తల్లి సరిగా పట్టించుకోవట్లేదని గ్రహించిన ఆ ముగ్గురు మహిళలు అదే అదనుగా భావించి తేదీ:23/12/2024 న వారితో పాటే పాపను తీసుకెళ్లగా ఈ సంఘటనపై పాప మేన మామ అయిన పలమారు గంగస్వామి, బాలరాజుపల్లీ గ్రామానికి చెందిన అతను సంఘటన జరిగిన వారం రోజులకు 30/12/2024 న వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బాలిక తల్లి మతిస్థిమితం లేని కారణంగా ఎలాంటి విషయలు చెప్పకపోవడంతో ఎలాంటీ ఆధారాలు లేనప్పటికీ జిల్లా పోలీస్ యంత్రాంగం ఛాలెంజింగ్ గా తీసుకొని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వేములవాడ టౌన్ సి.ఐ వీరప్రసాద్, టాస్క్ఫోర్స్ సి.ఐ సదన్ కుమార్, ఎస్.ఐ లు సుధాకర్, రమేష్, జునైద్,సిబ్బంది తిరుపతి,రాజేష్,అక్షర్, శ్రీనివాస్,మహిపాల్,ఇమ్రాన్,గోపాల్,బాబాయ్ లతో ఏడూ స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి ఎస్పీ పర్యవేక్షణలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర దేవస్థానం,బస్టాండ్లో,రైల్వే స్టేషన్లు,హైదరాబాద్,కరీంనగర్,వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోదాడ పరిసర ప్రాంతాలలో గల సిసి కెమెరాలు పరిశీలించి ఆధునిక సాంకేతికను ఉపయోగించి నిందితులు మహబూబాబాద్ జిల్లా ఒక గ్రామంలో ఉన్నట్లు తెలుసుకొని ఆ గ్రామ ఉప సర్పంచ్ సహాయంతో నిందుతులు అయిన శ్రీరామోజీ వెంకట నరసమ్మ,
గంభీరపు అంజవ్వ,కునపురి ఉప్పమ్మ ల వద్ద నుండి పాపను కాపాడి సిడబ్ల్యుసి(బాల రక్షక భవన్) చైర్మన్ అంజయ్య అప్పజెప్పడం జరిగిందని తదుపరి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగుందని, నిందుతులు అయిన ముగ్గురు మహిళలను శుక్రవారం రిమాండ్ కి తరలించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.సంఘటన జరిగిన ఏడు రోజులకు పిద్యాదు అందినప్పటికి తల్లి మతిస్థిమితం లేని కారణంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఛాలెంజింగ్ గా తీసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియెగిస్తూ అద్విత అపహరణ కేసును ఛేదించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,వేములవాడ టౌన్ సి.ఐ వీరప్రసాద్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్,ఎస్ఐలు సుధాకర్, రమేష్ ,జునైద్, సిబ్బంది తిరుపతి,రాజేష్, అక్షర్, శ్రీనివాస్, మహిపాల్, ఇమ్రాన్, గోపాల్,బాబాయ్ లను అభినందించి ప్రశంశ పత్రాలు అందించడం జరిగిందన్నారు.ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ లు వీరప్రసాద్ ,సదన్ కుమార్, ఎస్.ఐ లు సుధాకర్, రమేష్, జునైద్, సిబ్బంది పాల్గొన్నారు.