రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వివిధ గ్రామాలలోనీ ఆలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.ఆలయాలలో వివిధ పార్టీల నాయకులు, భక్తులు, ప్రజలు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు.
మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు నవీనా చారి ఆధ్వర్యంలో,
గొల్లపల్లి లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బుగ్గ వాసు శర్మ ఆధ్వర్యంలో, మూడు గుళ్ళ హనుమాన్ ఆలయంలో కృష్ణమా చార్యుల ఆధ్వర్యంలో ,వివిధ గ్రామాలలోని ఆలయాలలో ఆయా ఆలయ పూజారులు ఉత్తర ద్వారం ఏర్పాట్లు చేసి స్వామివారిని ప్రజలు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.