ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం చరిత్రలో నిలిచిపోతుంది.-రైతు, రైతు కూలీల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే.
– ప్రభుత్వవిప్ అది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఆర్థికంగా అదుకునేందుకు ఈ కొత్త పథకం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని ప్రభుత్వవిప్ అది శ్రీనివాస్ అన్నరు.సోమవారం రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రైతులతో కలసి టపాసులు పేలుస్తూ, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతును రాజుగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పం పెట్టుకుందని,రైతు, రైతు కూలీల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు సంతకం పెట్టాడని, ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించారని,మిడ్ మానేరు, శ్రీరాంసాగర్,వరద కాలువ వంటి వాటిని నిర్మించారని, గతంలోనే మన ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని, రుద్రంగి నాగారం, చందుర్తి, ఫాజిల్ నగర్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నమని అన్నారు.
కూలీలకు ఇబ్బంది తలెత్తకుండా ఆనాడు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేసిందని అన్నారు.గత ప్రభుత్వం ఏటా రైతు బందు 10 వేలు ఇస్తే, ప్రజా ప్రభుత్వం లో నేడు 12 వెలు ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయం చేసుకోవునే రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు.
కోనుగోలు కేంద్రాలలో గత ప్రభుత్వం దోపిడీ చేసిందని, గత ప్రభుత్వం హయంలో రైతులు కోనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాసే వారని,కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని అన్నారు.గత ప్రభుత్వం చెల్లించినట్లుగా రాళ్లు రప్పలు, రోడ్లు రహదారులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా వర్తించదని,వ్యవసాయ యోగ్యం కాని భూములకు మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూముల రైతు భరోసా వర్తించదని అన్నారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ జనవరి 26 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకుని అదే రోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం జరుతుందని అన్నారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు నగదు ఆర్ధిక సాయం పంపిణీ చేస్తుందని అన్నారు.జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఘనంగా ప్రారంభం కానుందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నారని అన్నారు.
భూమి లేని పేదలను ఆదుకోవాలని ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తోదని అన్నారు.