రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం రోజున జరిగినటువంటి బిజెపి,ఏబీవీపీ నాయకుల అక్రమ అరెస్ట్ లను, రిమాండ్ ను భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పక్షాన తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో నియంత్రత్వ, నిరంకుశ రాచరిక పాలనా సాగుతుందన్నారు .
దేశంలో అన్ని రాష్ట్రాలలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై పరిపాలన సాగుతుంటే రాష్ట్రంలో మాత్రం కల్వకుంట్ల రాజ్యాగం నడుస్తుందని ఆరోపించారు .ఈ పాలనా చూస్తుంటే నిజాం నిరంకుశత్వ రజాకార్ల వ్యవస్థ గుర్తుకు వస్తుందని, ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాల్సిన పోలీస్లే అధికార పార్టీకి కొమ్ము కాస్తు అక్రమ కేసులు పెడుతాన్నారని అన్నారు .కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చిత్ర పటాన్ని నిషేధిత గుట్కా ప్యాకెట్స్ తో అభిషేకించినప్పుడు బి ఆర్ ఎస్ నాయకులపై ఎందుకు కేసులు పెట్టలేదు అని ప్రశ్నించారు
.కావాలనే బిజెపి నాయకులను ఇబ్బంది పెట్టాలనే ప్రశ్నించే గొంతుకను అణిచివేయడానికే ఈ అక్రమ అరెస్ట్లు లు అని అన్నారు .జరిగిన సంఘటనతో సంబంధం లేకుండా అణిచి వేయాలనే దొరిణితో పోలీస్లు ఇష్టం వచ్చిన సెక్షన్స్ పెట్టారని ఈ అరెస్ట్ లకు పూర్తి బాధ్యత కేటీర్ దేనని .వచ్చే ఎలక్షన్లో మీ బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మీరు చేసే చర్యలకు కచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్,ధార తిరుపతి, శ్రీశైలం , మహేందర్ పటేల్, పర్శరాములు,మహేష్, లింగం, తిరుపతి బీజేవైఎం నాయకులు మహేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.