పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( pawan kalyan ), సాయి ధరం తేజ్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది.తమిళ హిట్ మూవీ వినోదయ సీతం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.
సినిమాకు సముద్రఖని( Samuthirakani ) డైరెక్షన్ చేస్తున్నారు.త్రివిక్రం డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ఆయన ఒకటి అనుకున్నారట.
త్రివిక్రం మాట కాదనని పవన్ ఆయన చెప్పిన టైటిల్ కే ఓకే అన్నట్టు టాక్.ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటి అంటే నేను కాలాన్ని అని అనుకుంటున్నారట.
సినిమాలో మరోసారి పవన్ దేవుడిగా కనిపిస్తున్నారు. సాయి ధరం తేజ్( Sai Dharam Tej ) ఫ్యామిలీ మెన్ గా నటిస్తున్నాడు.మామా అల్లుడు కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే.మరోపక్క పవన్ తన సోలో సినిమాలతో బిజీగా ఉన్నాడు.హరి హర వీరమల్లు సినిమాను ఈ ఏడాది ఎలాగైనా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.దానితో పాటుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.
పవన్ ఈ నాలుగు సినిమాలతో మరోసారి ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించనున్నాడు.