న్యాచురల్ స్టార్ నాని( Nani ) దసరాతో బంపర్ హిట్ అందుకున్నాడు.మొదటి నుంచి ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న నాని దసరా హిట్ తో సూపర్ జోష్ మీద ఉన్నాడు.
ఇక ఈ సినిమా హిట్ కొట్టడంతో నాని నెక్స్ట్ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుంది.నాని 30వ సినిమా శౌర్యువ్ డైరెక్షన్ లో వస్తుంది.
ఈ సినిమాను వైరా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు.సినిమాలో నానితో పాటుగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా 40 రోజుల లాంగ్ షెడ్యూల్ గోవాలో జరుగుతుంది.ఇక ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ రూపంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి 35 కోట్ల దీల్ ఒకటి వచ్చిందట.
నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే 70 కోట్ల దాకా ఆఫర్స్ వచ్చాయట.సో నాని దసరా( Dasara )తో 100 కోట్ల బిజినెస్ చేసే స్టార్ అయ్యాడని చెప్పొచ్చు.
నాని జెర్సీ సినిమాలానే తన నెక్స్ట్ సినిమాలో కూడా ఫాదర్ రోల్ లో కనిపించనున్నారు.నాని మృణాల్ ఇద్దరు సినిమాలో అదరగొట్టేస్తారని తెలుస్తుంది.
నాని 30వ సినిమాను కూడా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.అయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ సినిమా రిలీజ్ ఉంటుందని టాక్.