రాజన్న సిరిసిల్ల జిల్లా.ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ గంజాయిని తరిమి కొట్టాలి.
విద్యార్థినుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మండలంలో పోలీస్ అక్క పేరుతో మహిళ కానిస్టేబుల్ ఎంపిక.మహిళలు వేధింపులకు గురైనట్లు అయితే షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా పోలీస్ అక్కకు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లా: మహిళల,విద్యార్థినిల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని జిల్లా ఎస్పీ విద్యార్థులకు పిలుపునిచ్చారు.విద్యార్థులని చైతన్య పరచాలనే ఉద్దేశంతో ముస్తాబాద్ మండలంలో AMR ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు మహిళ రక్షణ, షీ టీమ్స్,ఈవ్ టీజింగ్ ,పొక్సో ,సైబర్ క్రైమ్స్,గంజాయి ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా షిటీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినీలు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదన్నారు.మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని,మైనర్ బాలికల పై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
విద్యార్థినులు మీ సమస్యలపై నేరుగా మీ పరిధిలోని పోలీస్ అక్కకు పిర్యాదు చేయండి…విద్యార్థినులు భద్రతయే లక్ష్యంగా జిల్లాలో అన్ని మండలాల్లో పోలీస్ అక్క పేరుతో ఒక మహిళ కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందని, ఈ పోలీస్ అక్క ఆయా మండలలో ఉన్న కళాశాలలు, పాఠశాలలతో కలుపుకొని ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేస్తు విద్యార్థినులు మీ సమస్యలపై పిర్యాదు అందగానే వెంటనే స్పందిస్తు అండగా నిలుస్తూ వారిలో ఆత్మవిశ్వాసం కలిగిస్తుందన్నారు.అంతే కాక జిల్లా షే టీం తో కలసి కళాశాలలు, పాఠశాలలతో మహిళ చట్టాలు, పొక్సో యాక్ట్, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ గంజాయిని తరిమి కొట్టాలి…గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి పోలీస్ శాఖ విన్నూత కార్యక్రమాలు, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ జాగిలాలు, గంజాయి కిట్ల సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఈ సంవత్సరం 93 కేసులలో 211 మందిని అరెస్ట్ చేసి 41 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని గంజాయి పై ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు.ప్రతి పాఠశాలలో, కలశాలలో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి మాధకద్రవ్యాలు, గంజాయి పై అవగాహన కల్పించడం జరిగిందని అందులో భాగంగా ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా ఉంటూ గంజాయిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
విద్యార్ధిని విద్యార్ధుల సోషల్ మీడియా(ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్)కు దూరంగా ఉండాలని,ప్రస్తుతం మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు,సోషల్ మీడియా వేధింపులు ఆన్లైన్ వేధింపులు సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ నంబర్ 87126 56425 సమాచారం ఇవ్వగలరని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ మొగిలి, ఎస్.ఐ గణేష్ , షీ టీం ఏ.ఎస్.ఐ ప్రమీల, షీ టీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.