ప్రభుత్వ విద్యాలయాలు, అంగన్వాడిల్లో ఆకస్మిక తనిఖీ ,రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ విద్యాలయాలు, అంగన్వాడిల్లో తప్పనిసరిగా నాణ్యతతో మెనూను పాటించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష సూచించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం, వెంకటాపూర్ గ్రామాలు, ముస్తాబాద్ మండలం ఆవునూర్ లోని మండల పరిషత్, జిల్లా పరిషత్ విద్యాలయాలు, అంగన్వాడి కేంద్రాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా విద్యాలయాల్లో మెనూ చార్ట్ ను ముందుగా పరిశీలించారు.
అనంతరం అక్కడ సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలు, వాటికి వినియోగిస్తున్న వివిధ పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు.స్టోర్ రూమ్ లోని నిల్వ చేసిన పదార్థాలను పరిశుభ్రతను తనిఖీ చేశారు.అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు.
విద్యాలయాల్లో ప్రభుత్వ నిబంధనలు మేరకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను విద్యార్థులకు పెట్టాలని సూచించారు.కచ్చితంగా మెనూ పాటించాలని పేర్కొన్నారు.
ఆహార ప్రాంతాలు సిద్ధం చేస్తున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.ఆమె వెంట ఆయా విద్యాలయాల హెచ్ఎంలు అంగన్వాయ అంగన్వాడి కేంద్రాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News