డిజిటల్ డ్రోన్ సర్వేను పరిశీలించిన కలెక్టర్ అమృత్ 2.0 స్కిం కింద ఎంపిక

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చేపట్టిన డిజిటల్ డ్రోన్ సర్వేను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం పరిశీలించారు.ప్రతిష్టాత్మక అమృత్ 2.0 స్కిం కింద సర్వే అఫ్ ఇండియా ఆద్వర్యంలో రూపొందిస్తున్న నూతన మాస్టర్ ప్లాన్ ల కొరకు సిరిసిల్ల పట్టణము ఎంపికైంది.ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణ సమగ్రాభివృద్ధి కొరకు సర్వే అఫ్ ఇండియాతో సిరిసిల్ల నూతన మాస్టర్ ప్లాన్ తయారీకై డిజిటల్ డ్రోన్ సర్వేను గురువారం ఉదయం 11.00 గంటలకు పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించారు.

 Collector Selected Under Amrit 2.0 Scheme After Examining Digital Drone Survey,-TeluguStop.com
Telugu Amrit Scheme, Councilors, Bathukamma Ghat, Drone, Lavanya-Telugu District

సర్వేలో బాగంగా సర్వే అఫ్ ఇండియా సిబ్బంది విలీన గ్రామ పంచాయతీలు, సిరిసిల్ల పట్టణంలోని గుర్తించిన వివిధ లొకేషన్ పాయింట్ల నుంచి డిజిటల్ డ్రోన్ సర్వే చేయనున్నారు.ఈ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, పలువురు కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube