రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ నెల 7వ తేదీ శనివారం ప్రత్యేక బీసీ కమిషన్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి రానుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో వెనుకబాటుతనం, వాటి స్వభావం, ప్రభావాన్ని సమకాలీన, క్షున్నమైన, అనుభవపూర్వక విచారణను నిర్వహించడానికి ఒక ప్రత్యేక బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో కమిషన్, గౌరవ సభ్యులు ఈ నెల 07-12-2024 తేదీ శనివారం 10.30 AM నుంచి 2.00 వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రజా అభిప్రాయము సేకరిస్తారని పేర్కొన్నారు.
రాతపూర్వక సమర్పణలు, అభ్యర్ధనలు తెలుగు / ఇంగ్లీష్ భాషలో తెలంగాణ వెనుకబడిన తరగతుల చైర్మన్, డెడికేటెడ్ కమిషన్ వారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.