రాజన్న సిరిసిల్ల జిల్లా :భార్య మృతికి కారణమైన భర్తకి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10,000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్పీ తెలిపిన వివరాల మేరకు…గంభీరావు పేట గ్రామానికి చెందిన కడరి రాజశేఖర్ S/o విజయ రావ్ age: 35yrs అనే వ్యక్తి అతని భార్య అయిన కడరి బాగ్య అనే ఆమెను అనుమానంతో తేది: 2.12.2020 రోజున బాగా కొట్టగా అట్టి దెబ్బల వలన భాగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేది 12.12.2020 రోజున ఆసుపత్రిలో మరణించింది.ఈ సంఘటనపై అప్పటి ఎల్లారెడ్డిపేట సిఐ భాన్సీలల్ కేసు నమోదు చేసి రాజశేఖర్ ను రిమాండ్ కు తరలించి,కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.కోర్టు మానిటరింగ్ ఎస్ ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, CMS కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శ్రీనివాస్ వాదించారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నింధితుడైన కడరి రాజశేఖర్ కి 10 సంవత్సరాల జైలు శిక్షతో 10,000/- రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూసమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పైకేసులో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన PP పి.శ్రీనివాస్, cms ఎస్.ఐ రవీంద్రనాయుడు,కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సిఎంఎస్ కానిస్టేబుల్ నవీన్ లను, అప్పటి సి.ఐ బన్సీలాల్, ప్రస్తుత డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు
.