సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు.దీనిని ఏం కాదులే అని లైట్ తీసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు.
ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే బరువు తగ్గాలని ఆలోచనలో ఉన్నారు.నిజానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలన్న వయసు, హైట్ కి తగ్గ బరువు ఉండాలి.
అప్పట్లో ఏమో కానీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యం విషయంలో ప్రజలలో అవగాహన పెరిగింది అని చెప్పవచ్చు.
దీని వల్ల బరువు తగ్గాలనుకునేవారు చాలా రకాలుగా కష్టపడుతున్నారు.
జిమ్, వాకింగ్, జాగింగ్ ఇంకా ప్రతి రోజు తీసుకునే ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకుంటూ ఉన్నారు.అయితే బరువు తగ్గడానికి కొన్ని చెడు అలవాట్లను కచ్చితంగా దూరం చేసుకోవాలి.
వాటిని దూరం చేసుకోకుంటే మాత్రం ఏం చేసినా దండగే అని నిపుణులు చెబుతున్నారు.ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం బిజీ జీవన విధానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలంటే ఆహారం, నిద్ర వంటివి పక్కన పెట్టేసి డబ్బు కోసం పరుగులు తీస్తున్నారు.అయితే నిద్రను పక్కన పెట్టడం మాత్రం అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మనిషికి ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు.కనీసం 6 గంటలకు పైన ఎలాంటి అవరోధం లేకుండా నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కానీ అంతకంటే తక్కువ నిద్ర మనిషి ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా మన శక్తిని దెబ్బతీయడంతో పాటు ఒత్తిడిని పెంచడం మనలో ఆకలిని దారుణంగా పెంచేస్తుంది.దీనివల్ల తదుపరి రోజుకు మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా ఉంది.ఇంకా చెప్పాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో నీటిని తాగడం మంచిది.
భోజనం చేసేటప్పుడు నీటిని తాగకుండా ఇతర ఖాళీ సమయాలలో వీటిని తాగడం మంచిది.భోజనానికి 30 నిమిషాల ముందు నీటిని తీసుకోవడం మానుకుంటే మంచిది.