మహిళా భద్రతకు మరో ముందడుగు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్, జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ లో భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.

 Bus Lo Bharosa Installation Of Cctv Cameras In Rtc And School Buses Details, Bus-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రం సిద్దించాక తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని,ఈ రోజున సిసిటివిల ద్వారా నేర నియంత్రలో దేశం మొత్తంలో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తోందని పేర్కొన్నారు.

మహిళా భద్రత కోసం షి టీములు ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పించడం జరుగుతుంది అన్నారు.మహిళలు,ఉద్యోగం చేసేవారు,గృహిణిలు తమ తమ అవసరాలను,పనుల కోసం ఎక్కువగా బస్ లలో విద్యార్థినిలు పాఠశాల బస్ లలో అత్యవసర సమయాల్లో, రాత్రి పగటిపూట ప్రయాణాల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళల రక్షణకై జిల్లా పోలీస్ శాఖ జిల్లాలోని ఆర్.టి.సి,పాఠశాల బస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

మహిళలు సురక్షితంగా, పూర్తి రక్షణ తో ప్రయాణించేందుకు బస్ లో భరోసా కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనియం అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 77 బస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం జరిగిందని, మిగిలిన బస్ లలో 10 నుండి 15 రోజులలో పూర్తి చేయడం జరుగుతుంది అని అన్నారు.ఆర్.టి.సి బస్ లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు డిపో కార్యాలయానికి, జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేయడం జరిగింది.పాఠశాల బస్ లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

మంత్రి వెంట రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్ టైల్, పవర్ లూమ్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదేయ్ రెడ్డి, నాగేంద్రచరి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube