లింక్స్ పేరుతో ఎరవేస్తారు... క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజల బలహీనతనే సైబర్ నేరగాళ్ల బలం అని తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవడం , మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటిపి షేర్ చేయడం, ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం వెతకడం,ఆన్లైన్ కస్టమర్ కేర్ నంబర్స్ వెతకడం,మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత లింక్స్ పెరితో ఎరవేసి క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బుకు ఊడ్చేస్తారని, ఇలాంటి సైబర్ మోసాలు ఎక్కవగా జరుగుతున్నయని, ఇట్టి సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తత ద్వారానే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని ఎస్పీ తెలిపారు.జిల్లాలో వారం రోజుల వ్యవధిలో నమోదైన సైబర్ కేసులు.

 They Will Lure You With The Name Of Links If You Click You Will Be Swept Away, S-TeluguStop.com

1.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి సిబిఐ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి మీ ఆధార్ తో ఇల్లీగల్ ప్రొడక్ట్స్ ఇండియా టు తైవాన్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి బెదిరించి మీ అకౌంట్ బ్లాక్ చేస్తామని బెదిరించి తన అకౌంట్లో ఉన్న మొత్తం రూపాయలు వారికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు దాంతో బాధితులు 17,80,000/- రూపాయలను నష్టపోయారు.

2.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుని వాట్సాప్ లో ఐపీఓస్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ గ్రూప్ లో ఆడ్ చేశారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేపిస్తున్నాము అని చెప్పి అందులో కొంత ఇన్వెస్ట్ చేయించారు ఇనిషియల్ అతనికి రిఫండ్ ఇవ్వడం వలన అతడు నమ్మి దాదాపుగా 10 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేశాడు తర్వాత అతడు విత్ డ్రా చేస్తాను అని అడగగా 20% టాక్స్ రూపంలో కడితేనే విత్ డ్రాకు అనుమతిస్తామని చెప్పారు అది ఫ్రాడ్ అని 1930 కి కంప్లైంట్ చేయడం జరిగింది.

3.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుని ఇంటి పైన సెల్ టవర్ ఇన్స్టాలేషన్ చేస్తామని బాధితుని నమ్మించగా అది నిజమే అని నమ్మి జిఎస్టి చార్జెస్, అదర్ ఎక్స్పెన్సివ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అని చెప్పి అమౌంట్ అడగగా బాధితుడుని 20,000 రూపాయలు మోసగించడం జరిగింది

సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

1.లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
2.కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు.ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
3.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
4.లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
5.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు.వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
6.OLX, 99acres, Magicbricks లాంటా యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.
7.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
8.పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
9.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి.లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube