విద్యా వ్యవస్థలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో జిల్లా కేంద్రం తెలంగాణ భవన్ లో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ప్రదాత పది సంవత్సరాలు అభివృద్ధికి నిరంతరం పాటు పడిన వ్యక్తి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పైన వున్న అక్కసుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కంచర్ల రవి గౌడ్ విమర్శించారు.

 Kancharla Ravi Goud Protested Against The Misuse Of Public Funds In The Educatio-TeluguStop.com

తెలుగు పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరు వుండటం పై ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పటం పైన ఆయన ద్వజమెత్తారు.

ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్న కూడా ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి విద్యాశాఖ పైన కనీసం సమీక్షే నిర్వహించలేక పోయారు అని తెలపడం జరిగింది.

పాఠ్య పుస్తకాల ముద్రణ సమయం లోనే ముందుగా ఎందుకు సమీక్ష జరుపలేదని ప్రశ్నించారు.పక్క రాష్ట్రం తమిళనాడు లో మాజీ సిఎం జయలలిత పోటోలు వున్న స్కూల్ బ్యాగు లను విద్యార్థులకు అందచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారని,తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు కూడా చంద్రబాబు నాయుడు అలానే అమలు అయ్యేలా చూడాలి అని తెలియచేశారన్నారు.

కాని తెలంగాణ రాష్ట్రం లో అందుకు విరుద్ధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని మండి పడ్డారు.

ప్రభుత్వ పాఠ్య పుస్తకాల లో ఇపుడు వున్న ముఖ్యమంత్రి పేరు లేదు అని దురుద్దేశం తో అక్కసుతో కోట్లాది రూపాయలు భారం పడేలా చూస్తున్నారు అని అన్నారు .ఇప్పటి కి అయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయద్దు అని పుస్తకాల్లో కేసీఆర్ పేరు వుంటే ఎం అవుతుంది అని ప్రశ్నించారు.వాటన్నిటినీ వదిలి ప్రజాపాలన మీద మీరు ఇచ్చిన హామీలు అయ్యేలా వ్యవహరించాలని రాష్ట్రం లో వున్న విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అని వెంటనే విద్య శాఖ మంత్రి నీ ఏర్పాటు చేయాలి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు ఒగ్గు అరవింద్, రుద్రవీని సుదీప్,కొడం వెంకటేష్, భాను,తిరుపతి వంశి,సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube