ఈసీ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: లోక్ సభ ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్(ఈసీ) మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు , ఓపీఓలకు సిరిసిల్ల పట్టణంలోనీ గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

 There Should Be Thorough Understanding Of Ec Guidelines Collector Anurag Jayanth-TeluguStop.com

ఈ శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

పోలింగ్ డే రోజు ప్రిసైడింగ్ ,సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నియమ, నిబంధనల పై ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు  అవగాహన కలిగి ఉంటే నమ్మకం తో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.హ్యాండ్ బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ బుక్ లోని అన్ని నిబంధనలను జాగ్రత్తగా చదవాలని సూచించారు.

ఎన్నికల సమయంలో పాటించాల్సిన విధులపై ఎన్నికల కమిషన్ అందించే పుస్తకాలను సంపూర్ణంగా చదవాలని, ముఖ్యమైన సెక్షన్, నిబంధనలు హైలైట్ చేసుకోవాలని, మనం నిబంధనల ప్రకారం ప్రవర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని స్పష్టం చేశారు.  పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్ మధ్యలో కనెక్షన్, ఓటింగ్ కంపార్ట్మెంట్ రూపొందించడం, ఓటరు గోప్యంగా తన ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం కల్పించడం వంటి ఏర్పాట్లపై ప్రెసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు తీసుకోవాల్సిన చర్యలు, వారికి ఉన్న హక్కులు, బాధ్యత లను సంపూర్ణంగా తెలుసుకొని ప్రతి పోలింగ్ అధికారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

గత ఎన్నికల సమయంలో ఎదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై చర్చించాలని పేర్కొన్నారు.మాక్ పోలింగ్ కు ఏజెంట్ లు రాకపోతే అనుసరించాల్సిన విధానం, మాక్ పోల్ నిర్వహణ, పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేయాల్సిన పనులపై వివరించారు.

పోలింగ్ రోజు ఏమైనా సందేహాలు ఉన్న, సమస్యలు ఎదురైనా సెక్టార్ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.కాగా ఈ శిక్షణ కార్యక్రమాలు నేడు (గురువారం) కూడా కొనసాగనున్నాయి.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఏఆర్ఓలు పూజారి గౌతమి, రాజేశ్వర్, సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, సీపీఓ  పిబి శ్రీనివాస చారి, తహసీల్దార్లు షరీఫ్ మొహినోద్దీన్ మహేష్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube