రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎంపీ ఎన్నికల ప్రచారం లో భాగంగా జిల్లా లోని విద్యార్థీ , ప్రజా సంఘాల నాయకులు రుంధ్రంగి మండలములోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వెలిచాల రాజేందర్ రావు మద్దతు గా ప్రచారం నిర్వచించారు.ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ , లంబాడా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బాణోత్ నరేష్ నాయక్ , బహుజన సేన జిల్లా అద్యక్షులు జింక శ్రీధర్ , మాట్లాడతూ … రాజ్యాంగన్ని మారుస్తాం అంటున్న బీజేపీ నీ మార్చే అవకాశం ఈ నెల 13 వచ్చింది అని అన్నారు.
ఎందుకంటే గత పది సంవత్సరాల ముందు అధికారం కోసం .వేల అమిలను ప్రకటించి అధికారం లోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల లో దేశానికి చేసింది ఏమి లేదని ఇచ్చిన ఒక్క అమీ నెరవేర్చ కుండా ఏటా 2కోట్ల ఇస్తా అని
ఒక్క ఉద్యొగం ఇవ్వకుండా నిరోధ్యగులని మోసం చేసింది అని రైతుల ఆదాయం రెట్టింపు చేస్త అని రైతు వ్యతిరేకా చట్టాలు తెచ్చి ,తిరగబడ్డ రైతులను కాల్చి చంపించింది అని, నిత్యావసర వస్తువుల ధరల తో పాటు వంట గ్యాస్ , పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సమన్యుల నడ్డి విరించింది అని .దేశ సంపద మొత్తని అధాని, అంబానీ లకు అమ్ముతూ,దేశాన్ని అధోగతి చేస్తుంది అని విమర్శించారు .చేసిన అభివృద్ది లేక చెప్పు కోవటానికి ఏమి లేక .గుళ్ళో ఉండాల్సిన దేవుళ్ళను వీధిలోకి తెచ్చి గుండెల్లో ఆన్న భక్తినీ రాజకీయాలు వాడుకుంటూ , దేవుళ్ళలు అడ్డు పొట్టుకొని బిచ్చ మొత్తుకునట్టు ,రాముని పేరూ చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారని విమర్శించారు.400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అని , రిజర్వేషన్లు తీసేస్తం అని బహిరంగానే చెప్పుకుంటున్నారు అని.
అల అయితే దేశం లో ప్రజాస్వామ్యం ఖుని అయ్యి,స్వేచ్ఛ సమానత్వం లేక అడుగే దిక్కు లేకుండా పోయి దేశాన్ని మొత్తం నాశనం చేసి దేశాన్ని కూడా ప్రవేట్ వ్యక్తులకు అమ్మేస్తుంది అని అన్నారు.ఇప్పటి అయిన ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ లు మేలుకోవలసిన అవసరం ఉందని.
బీజేపి గద్దె దించాలి అంటే ,కాంగ్రెస్ అభ్యర్థి అయిన వెలిచాల రాజేందర్ రావు ని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు గా హాస్థం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పీలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో విద్యార్థీ సంఘ నాయకులు ,కాంగ్రెస్ గ్రామశాఖల అద్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.