ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తండాలో మాజీ సర్పంచ్ భూక్య సీత్యా నాయక్ కు చెందిన ఐదు మేకలపై బుధవారం కుక్కలు దాడి చేసి హాతమార్చాయి.బ్రతుకుదెరు వు కోసం ఎల్లారెడ్డిపేట కే డి సి సి బ్యాంకులో నాలుగు లక్షల రూపాయల అప్పు తీసుకుని గత నాలుగు సంవత్సరాల నుంచి మేకలను భూక్య అమున సీత్యా నాయక్ పెంచుకుంటు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
తన ఇంటి బయట తాళ్లతో కట్టి ఉంచిన ఐదు మేకలను 10 కుక్కలు దాడి చేసి హతమార్చినయని దీంతో తనకు 80000 వేల రూపాయలు నష్టపోయినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.ఎల్లారెడ్డిపేట మండలంలో కుక్కల బెడద తీవ్రమైందని మూగజీవాలపై దాడులకు తెగబడుతున్న కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ,రోడ్ల పై వెళ్లాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురవుతూ ఉన్నారని తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు…
.