8వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికీ 8వ రోజుకు చేరుకుంది.ఈ సమ్మెలో భాగంగా ఈరోజు గ్రామపంచాయతీ కార్మికులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు.

 Gram Panchayat Workers Strike Enters 8th Day, Gram Panchayat Workers, Gram Panch-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కార్మికులకు జీతం పెంచాలని, దీనస్థితిలో బతుకుతున్న తమ జీవితాలను గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు రేసు రాజయ్య, మండలం అధ్యక్షులు జక్కుల మహేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామ్ దాస్, శ్రీధర్, భారతి, లక్ష్మి, నరసయ్య, దేవయ్య, వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube