సీఈఐఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి - వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada ) రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు.ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సి ఈ ఐ ఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

 Everyone Should Be Aware Of Ceir Portal - Vemulawada Rural Si Maruti , Vemulawad-TeluguStop.com

ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తి కి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు, సి ఈ ఐ ఆర్ ద్వారా తంగళ్లపల్లి మండలం రామన్న పేట గ్రామానికి చెందిన తిరుపతి కి తన ఫోన్ అందించటం జరిగింది అని తెలిపారు.బాధితుడు వేములవాడ రూరల్ పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube