రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పరిశీలించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యం కోసం ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి రెండు మండలాలకు చెందిన గర్భవతులకు, బాలింతలకు ప్రతి రోజు మద్యహ్న భోజనం పెట్టె కార్యక్రమం ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోంది.
వంట గది లేకపోవడంతో ఆరోగ్య కేంద్రములో గల స్టోర్ రూమ్ లో వంటలు చేసి ఇన్ పెషెంట్ గా ఉన్న వారి కోసం వంట చేసి పెడుతున్నారు.
శాశ్వత వంటగదిలేకపోవడం తో వంట గది ఎక్కడ నిర్మించాలనే ఉద్దేశం తో స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ స్థలం పరిశీలన చేశారు.
వంట గది తో పాటు ఇన్ పేషెంట్ లకు మూత్రశాలల ఇబ్బంది ఉందని తెలుసుకొని సంబంధిత అధికారులతో మంజూరు కోసం ఆమె సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.ఆమె వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, మండల వైద్యాధికారి ప్రదీప్ ఉన్నారు.