బాల్యవివాహాలను ఆపుదాం.. బాలల హక్కులు కాపాడుదాం..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని వీర్నపల్లి ప్రాంతంలో బాలల హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.దీనిలో భాగంగా మద్దిమల్లలోని లొద్దితాండ, వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం మోడల్ స్కూల్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

 Lets Stop Child Marriages Lets Protect Childrens Rights, Stop Child Marriages ,p-TeluguStop.com

దీనిలో భాగంగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181 గురించి వివరించడం జరిగింది.చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని సామాజిక సమస్యలు తలెత్తుతాయని, ఎదుగుదల దెబ్బతినడం లాంటి సమస్యలు వస్తాయని మానసికపరమైన శారీరకపరమైన సమస్యలు తలెత్తుతాయని

ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించడం జరిగింది.

అలాగే బాలల హక్కుల గురించి వివరించడం జరిగింది.విద్యార్థులకు భిక్షాటన చేస్తున్న బాలలు కానీ, పాఠశాల మానేసి పనికి వెళ్తున్న పిల్లలు కానీ, శారీరక మానసిక లైంగిక వేధింపులకు గురవుతున్న బాలలు కానీ కనిపిస్తే 1098కు సమాచారం అందించాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం, సిడిపిఓ సుచరిత, సూపర్వైజర్ రేణుక ,డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ స్వర్ణలత,డి హబ్ కౌన్సిలర్ దేవిక ,చైల్డ్ లైన్ కౌన్సిలర్ రేణుక సఖి నుండి దీపిక, సెక్టోరియల్ ఆఫీసర్ శైలజ ప్రిన్సిపల్ విశ్వనాథం, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ నీలిమ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube