లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు.మంగళవారం తంగాళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.

 In View Of The Lok Sabha Elections 06 Check Posts Have Been Set Up On The Distri-TeluguStop.com

లోక్ సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వివరాలు.

1.తంగాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధి – జిల్లెళ్ల చెక్ పోస్ట్.
2.గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధి – పెద్దమ్మ చెక్ పోస్ట్.
3.ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి – వెంకట్రావ్ పల్లి చెక్ పోస్ట్.
4.వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి – ఫజుల్ నగర్ చెక్ పోస్ట్.
5.బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి – కొదురూపాక చెక్ పోస్ట్.
6.రుద్రాంగి పోలీస్ స్టేషన్ పరిధి – మనాల క్రాస్ రోడ్ చెక్ పోస్ట్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మద్యం,డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో పరిధిలో ఏర్పాటు చేసిన 06 చెక్ పోస్ట్ ల వద్ద జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ మద్యం, డబ్బు రవాణా అడ్డుకట్ట వేయాలని చేయాలని అధికారులను,సిబ్బందిని ఆదేశించారు.ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబందనలు పాటించాలని సూచించారు.

తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా 50 వేల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకువెళ్లినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు డబ్బులను తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు.

నగదుకు సంబంధించిన తగిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమమని అన్నారు.ఎన్నికల నియమావలిని అందరూ పాటిస్తూ వాహనాల తనిఖీలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube