చాలామంది నోటి నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది.అయితే ఇలా నోటి నుండి దుర్వాసన రావడం వలన ఎదుటి వాళ్లకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
దీని వల్ల మన చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ ఇబ్బంది పడుతుంటారు.మనం ఎక్కడికైనా బయట ప్రదేశానికి వెళ్ళినప్పుడు, లేదా సమావేశానికి హాజరైనప్పుడు లేదా, స్నేహితులు, పొరుగువారు, సహుద్యోగులు తో మాట్లాడేటప్పుడు దుర్వాసన గురించి వారు ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తారు.
మన ముందర చెప్పకపోయినా ఇతరుల దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావిస్తారు.అయితే ఇలాంటి సందర్భాల్లో మనం చాలా ఇబ్బంది, తక్కువ విశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

సాధారణంగా ఇది మనం నోటిని శుభ్రం చేయకపోవడం వలన, బ్యాక్టీరియా( Bacteria ) లోపల పేరుకుపోవడం వలన వస్తుంది.దంతాల కుహరం లేదా చిగుళ్ళకు సంబంధించిన సమస్య ఉంటే ఇలా నోటి నుండి దుర్వాసన వస్తుంది.ఇక మరికొందరిలో ఫైయోరియా( Pyorrhea ) వల్ల కూడా నోటి నుండి దుర్వాసన వస్తుంది.అయితే నోటి నుండి దుర్వాసన పోగొట్టే కొన్ని ఇంటి నివారణలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోటి దుర్వాసన వల్ల ఇతరులు సమస్యలను ఎదుర్కోకూడదంటే దీని కోసం పటిక బాగా సహాయపడుతుంది.ఒక గ్లాసు నీటిలో పటికను వేసి ఒక 25 నిమిషాలు అలాగే ఉంచాలి.
ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తో నీటిని ఫిల్టర్ చేసి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఇక దాన్ని ప్రతిరోజు పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటితో పుక్కిలించాలి.దీంతో నోటి దుర్వాసన దూరం అవుతుంది.బేకింగ్ సోడా సాధారణంగా ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే నోటి నుండి దుర్వాసన వస్తుంటే ఒక గ్లాసు నీటిలో ఒక అరటి స్పూన్ బేకింగ్ పౌడర్ కలుపుకొని రోజుకు కనీసం రెండుసార్లు నోటిలో వేసుకుని శుభ్రం చేసుకోవాలి.దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది.
లవంగం వంటకాలలోనే కాకుండా సుగంధంగా కూడా ఉపయోగిస్తారు.అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది.
అందుకే ఇది నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుంది.మీరు తాజాదనాన్ని కోరుకుంటుంటే లవంగాలను( Clove ) నమాలాలి.
ఉదయం బ్రష్ చేసిన తర్వాత లవంగాలతో తయారు చేసిన టీ తాగాలి.