తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.సంగీత దర్శకుడు కోటితో కలిసి రాజ్ పలు చిత్రాలకు సంగీతం అందించారు.
తరువాత కోటితో విభేదాలు రావడంతో రాజ్ మ్యూజిక్ డైరెక్షన్ కు దూరం అయ్యారు.ఆయన సంగీతం అందించిన తొలి చిత్రం ప్రళయ గర్జన.
తరువాత హాల్ బ్రదర్, యముడికి మొగుడు, బాల గోపాలుడు, సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీతం అందించారు.







