రాజన్న ఆలయ అభివ్రుద్ధి పేరుతో దేవుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్.. మీడియాతో బండి సంజయ్

రాజన్న ఆలయ అభివ్రుద్ధి పేరుతో దేవుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్.దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్ సర్కారే నిదర్శనం.

 Sanjay Bandi With Kcr Who Offered Shathagopa To God In The Name Of Development O-TeluguStop.com

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నా.ఎములాడ రాజన్న ఆలయ దర్శనానంతరం మీడియాతో బండి సంజయ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజన్న ఆలయాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తా… నేనేంటో చూపిస్తా’’నని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనమన్నారు.రూ.4 వందల కోట్లతో రాజన్న ఆలయాన్న అభివ్రుద్ధి చేస్తానని హామీ ఇచ్చి దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్ సర్కార్ దేనన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎములాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాల అభివ్రుద్దికి సహకరించాలని, ప్రభుత్వానికి సహకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు.కొద్దిసేపటి క్రితం వేములవాడ రాజన్న ఆలయ దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది.

ప్రధాని మోదీ కూడా వేములవాడకు వచ్చి మీ అభిమానానికి ముగ్దులయ్యారు.ముఖ్యంగా నన్ను ఆదరించిన వేములవాడ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.వారికి రుణపడి ఉంటా.కనీవినీ ఎరగని రీతిలో ఎంపీ ఎన్నికల్లో ఏకంగా 43 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించిన మిమ్ముల్ని మర్చిపోను.

వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని తప్పనిసరిగా అభివ్రుద్ధి చేసి తీరుతా.కేంద్ర మంత్రిగా శక్తివంచన లేకుండా ఆలయ అభివ్రుద్ధికి క్రుషి చేస్తా.

రాజన్నను మోసం చేసిన వాళ్లకు తగిన గుణపాఠం చెబుతారనడానికి కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనం.ఎములాడ ఆలయ అభివ్రుద్ధికి రూ.4 వందల కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి దేవుడికే శఠగోపం పెట్టిన మూర్ఖపు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంది.రాజన్న, కొండగట్టు ఆలయాలను అభివ్రుద్ధి చేసుకుందాం ప్రతిపాదనలు పంపాలని ఎంపీగా ఉన్నప్పుడు అనేకసార్లు కోరినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా బీజేపీకి పేరొస్తుందని అనేక కుట్రలు చేశారు.

రాజన్న ఆలయానికి వచ్చే వాళ్లలో అత్యధికులు పేదలే… ఇక్కడికి వస్తే సౌకర్యాల్లేక అల్లాడుతున్నారు.అందుకే దేవాలయ అభివ్రుద్ది చేయాలనే హామీకి కట్టుపడి పనిచేస్తా.రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తా.ఆలయ విస్తరణ విషయంలో కమిట్ మెంట్ తో పనిచేస్తా.

అభివ్రుద్ది చేసి నేనేంటో చూపిస్తా

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube