రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోవులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపూర్ గోశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా చేశారు.
ఈ సందర్భంగా గోశాల ఆవరణ, అక్కడ చేపడుతున్న పనులను పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా చేయాలని సూచించారు.గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.దాణా, ఇతర విషయాల్లో జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.
ఇక్కడ జిల్లా పశు సంవర్థక అధికారి రవీందర్ రెడ్డి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.