శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎనిమిది నెలల పాటు ఐ ఐ టి ఎ,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం “షాడో“( Shadow ) ను మంగళవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన షాడో జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమని అన్నారు.

 Police Jagilam Assigned To The District After Completion Of Training , Shadow,do-TeluguStop.com

పోలీస్ జాగీలం( Police Jagilam ) షాడో కి హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ యాదవ్, ఇతర డాగ్ స్క్వాడ్ ( Dog Squad )అధికారులు,సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ( Police Department )లో పనిచేస్తున్న 06 పోలీస్ జాగిలాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జాగిలాల సంరక్షణ,వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube