రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓటర్ ఎపిక్ కార్డ్స్ ప్రింటింగ్ వేగంగా చేపట్టాలని గురువారం హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుండి జాయింట్ సెక్రెటరీ సర్ఫరాజ్ అహ్మద్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఓటర్ ఎపిక్ కార్డ్స్, ఎలక్షన్ సంబంధిత అంశాలపై గూగుల్ మీట్ సమావేశం నిర్వహించారు.జిల్లా నుండి ఎన్నికల అధికారి , కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బందితో కలెక్టరేట్ నుండి మీట్ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ ఓటర్ ఎపిక్ కార్డ్స్ ప్రింట్ త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలు వెంట వెంటనే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ ఎపిక్ కార్డ్స్ ప్రింట్ త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికలకు సంబంధించిన అన్ని విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు నిత్యం శిక్షణ తరగతులు, తనిఖీలు నిర్వహించి అప్రమత్తం చేసి అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని జాయింట్ సెక్రెటరీకి కలెక్టర్ వివరించారు, అనంతరం పోలింగ్ పర్సన్ ర్యాండమైజేషన్ పై అదనపు ఎన్నికల ప్రధానాధికారి లోకేష్ కుమార్ హైదరాబాద్ నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించగా ఈ గూగుల్ మీట్ కు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఈవో ఏ రమేష్ కుమార్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.