2 రోజుల వరకు పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ వెంటనే అందించాలి

లేకుంటే సోమవారం హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కమీషనర్ ఆఫీసుకు వెళ్తాంసిఐటియు( CITU ) పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )సిరిసిల్ల పట్టణం బి.వై.నగర్ లోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ 2021 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని అందించడంలో అధికారులు తీవ్రంగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.2020 సంవత్సరం బతుకమ్మ చీరల సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించి దాదాపు 4 నెలలు గడుస్తున్న కూడా ఇప్పటివరకు 2021 సంవత్సరం ఏ ఒక్క కార్మికునికి సబ్సిడీ అందించలేదని 2021 సం!! బతుకమ్మ చీరలకు సంబంధించి కార్మికుల ఉత్పత్తి వివరాలను ఇప్పటికే యజమానుల నుండి అధికారులు తీసుకోవడం జరిగిందని సర్వే కూడా పూర్తి చేసి హైదరాబాద్ చేనేత జౌళి శాఖ అధికారులకు పంపించడం జరిగిందన్నారు.అయినా కూడా కార్మికుల ఖాతాలలో సబ్సిడీ డబ్బులు ఇప్పటికీ ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు.

 10% Yarn Subsidy Due To Powerloom Workers For 2 Days Should Be Provided Immediat-TeluguStop.com

సబ్సిడీ డబ్బులు కార్మికులకు కాలయాపన చేయకుండా అందించాలని అక్టోబర్ 5 వ.తేదీన సిఐటియు c ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టిన సందర్భంగా రెండు మూడు రోజుల లోపే కార్మికులకు సబ్సిడీ డబ్బులు అందిస్తామని చెప్పడం జరిగింది.కానీ ఇప్పటివరకు సబ్సిడీ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ కాలేదన్నారు.

ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు( Assembly Election Schedule ) ప్రకటించడంతో కార్మికులు సబ్సిడీ డబ్బులు వస్తాయో రావో అని పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారన్నారు.మరో వారం పది రోజుల్లో బతుకమ్మ , దసరా పండుగలు ఉన్నందున కార్మికులకు సబ్సిడీ డబ్బులు వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని లేకుంటే పండుగల పూట కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతుందని అలాంటి పరిస్థితి రాకుండా కార్మికుల ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా చేనేత జౌళి శాఖ అధికారులు కాలయాపన చేయకుండా వెంటనే రెండు రోజుల వరకు సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాలలో జమ చేయాలన్నారు.

లేకుంటే అక్టోబర్ 16 సోమవారం రోజున హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కమిషనర్ ని సబ్సిడీ డబ్బులు గురించి కార్మికుల తో కలిసి వెళ్లి కలుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ , కార్యదర్శి గుండు రమేష్ , సబ్బని చంద్రకాంత్ , బెజుగం సురేష్ , మోర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube