రూ. 50 వేల కంటే ఎక్కువ తరలిస్తే సీజ్ చేయాలి - అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యoలో సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే సీజ్ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు.ఎఫ్ఎస్టీ ( ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్) ఎస్ఎస్టీ( స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్) వీఎస్టీ( వీడియో సర్వెలెన్స్ టీమ్)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో బుధవారం శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడారు.

 More Than 50 Thousand Should Be Seized Additional Collector Khemyanaik, More Tha-TeluguStop.com

ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ సభ్యులు డబ్బులు, మద్యం, గిఫ్ట్ ప్యాకులు సీజ్ చేసే క్రమంలో వీడియో తీయాలని సూచించారు.సీజ్ చేసిన వాటికి సంబంధించి రసీదు అందజేయాలని తెలిపారు.

డబ్బు తీసుకెళ్లే వారు వాటికి సంబంధించి పత్రాలు, ఆధారాలు వెంట ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అధికారులు బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.

అనంతరం వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీలకు విధుల్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.

వారి సందేహాలను నివృత్తి చేశారు.రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులు, సామగ్రి జీఎస్టీ బిల్లు లేకుండా తరలిస్తే సీజ్ చేయాలని తెలిపారు.అలాగే నోడల్ ఆఫీసర్ రఫీ సీ విజిల్ యాప్ వినియోగం, ఫిర్యాదులు వస్తే ఎంత సమయంలోగా చేరుకోవాలి, దానిని ఎన్ని నిమిషాల్లో క్లోజ్ చేయాలనే అంశాలపై వివరించారు.కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube