దాదాపు ఎనిమిది నెలలుగా ఖతార్ అధికారుల కస్టడీలో ఉన్న శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ ( Shri Guru Granth Sahib )జీకి చెందిన రెండు ‘స్వరూప్స్’లను కాపాడేందుకు దౌత్యపరమైన జోక్యాన్ని కోరుతూ బీజేపీ నేత సుఖ్మీందర్‌పాల్ సింగ్ గ్రేవాల్ ( Sukhminderpal Singh Grewal )విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు( Dr S Jaishanka ) లేఖ రాశారు.ఈ లేఖలో .
ఖతార్‌లోని సిక్కు సమాజ వేదనను గ్రేవాల్ పంచుకున్నారు.ఖతార్‌లోని సిక్కు సంగత్ (కమ్యూనిటీ) ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ గ్రంథాల విడుదలలో నేటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు.
ఈ పరిణామాలతో సిక్కు సమాజం దిగ్భ్రాంతి, వేదనలో ఉందన్నారు.
స్వరూప్‌లను తక్షణమే విడుదల చేయడానికి, అక్కడ గురుద్వారాల ఏర్పాటులో జోక్యం చేసుకోవాలని ఖతార్ ప్రభుత్వంతో చర్చించాలని జైశంకర్‌కు గ్రేవాల్ విజ్ఞప్తి చేశారు.సిక్కులు తమ విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించగలరని నిర్ధారించుకోవడానికి అక్కడి భారత రాయబార కార్యాలయం( Embassy of India ) స్థానిక అధికారులతో ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని మంత్రిని గ్రేవాల్ అభ్యర్ధించారు.ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సిక్కు నాయకులు, సంస్థలలో విస్తృతమైన ఆందోళనను రేకెత్తించిందని , సిక్కు గ్రంథాల పవిత్రతను కాపాడేందుకు భారత ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఆయన కోరారు.
మరోవైపు గురుగ్రంథ్ సాహిబ్ కాపీలను ఖతార్ ప్రభుత్వం సీజ్ చేయడంపై రెండ్రోజుల క్రితం విదేశాంగ శాఖ ప్రకటన చేసింది.ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.ప్రభుత్వం ఇప్పటికే ఖతార్‌కు ఈ విషయాన్ని తెలియజేసిందని, దోహాలోని భారత రాయబార కార్యాలయం పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని జైస్వాల్ వెల్లడించారు.ఖతార్ ప్రభుత్వ అనుమతి లేకుండా మతపరమైన స్థాపనను నిర్వహిస్తున్నందుకు గాను రెండు గ్రూపుల నుంచి ఈ స్వరూప్స్‌ను అక్కడి అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
సిక్కు పెద్దల నుంచి ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.