టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన హీరో ఎవరనే ప్రశ్నకు రాజ్ తరుణ్( Raj Tarun ) పేరు సమాధానంగా అనిపిస్తుంది.రాజ్ తరుణ్ త్వరలో భలే ఉన్నాడే సినిమా( Bhale Unnade )తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
రాజ్ తరుణ్ గత సినిమాలు సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఫ్లాప్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజ్ తరుణ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
సెప్టెంబర్ నెల 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండగా శివ సాయి వర్ధన్( Shiva Sai Vardhan ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.రాజ్ తరుణ్ మాట్లాడుతూ మా దర్శకుడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని ట్రైలర్ లో గబ్బర్ సింగ్ డైలాగ్ పెట్టడానికి అదే కారణమని రాజ్ తరుణ్ అన్నారు.రెండు నెలల్లో మూడు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేయలేదని అలా జరిగింది అంతేనని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.నాకు సవాలుగా ఉండే రోల్స్ అంటే ఇష్టమని ఈ సినిమాలో పాత్ర కొత్తగా ఉంటుందని రొటీన్ గా చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.
గతంలో నేను నటించిన సినిమాలను సరిగ్గా ప్రమోట్ చేయలేదని ఈ విషయంలో నేను పశ్చాతాప పడుతున్నానని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.
రాజ్ తరుణ్ బిగ్ బాస్ షోకు వెళ్లనున్నారని ఈ మధ్యకాలంలో తరచూ వార్తలు వినిపిస్తుండగా అతను బిగ్ బాస్ షోకు వెళ్లే అవకాశం లేదని ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చేసింది.సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రతి సినిమా హిట్ అయితే మాత్రమే ఇండస్ట్రీ బాగుంటుందని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.భలే ఉన్నాడే సినిమా అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఈ సినిమాను కుటుంబమంతా కలిసి చూడొచ్చని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.
ఉయ్యాల జంపాల సినిమాలో నన్ను ఏ విధంగా చూశారో ఈ సినిమాలో కూడా కొంచెం అదేవిధంగా ఉంటానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు.