ఈనెల 20 వతేదీలోగా గృహలక్ష్మి పథకం దరఖాస్తుల విచారణ పూర్తి చేసి అర్హుల జాబితా అందించాలి

గృహలక్ష్మి పథకం( Gruhalakshmi ) లో ఇండ్లు లేని అత్యంత పేదలకు లబ్దిదారుల ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలి ఒక్క చిన్న ఆరోపణ కు అవకాశం లేకుండా పారదర్శకంగా వెరిఫై చేయాలిరాజన్న సిరిసిల్ల జిల్లా : ‘గృహలక్ష్మి‘ దరఖాస్తులపై విచారణ పారదర్శకంగా చేసి ఇండ్లు లేని, పూరి గుడిసెల్లో ఉండే అత్యంత పేదలను మాత్రమే పథకం అర్హులుగా తేల్చాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) చెప్పారు.బుధవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి గృహలక్ష్మి పథకం దరఖాస్తుల వెరిఫికేషన్, హరిత హరం ప్లాంటేషన్, మొక్కల సంరక్షణ పై అన్ని మండలాల తహశీల్దార్ లు, ఎంపిడివో లు , మున్సిపల్ కమిషనర్ లు, విచారణ బృందాల సభ్యులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 By 20th Of This Month, The Investigation Of Grilahakshmi Scheme Applications Sho-TeluguStop.com

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హుల జాబితా రూపకల్పనలో పాటించాల్సిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేశారు.జిల్లాలో గృహలక్ష్మి’ దరఖాస్తులు మొత్తం 20,375 వచ్చాయని చెప్పారు.

మొదటి విడతలో జిల్లాకు ప్రభుత్వం 6300 ఇండ్లను మంజూరు చేసిందన్నారు.ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3 వేల ఇండ్లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు.

మహిళ లేదా వితంతువు పేరు మీద మంజూరు అవుతుందని, లబ్ధిదారులు నచ్చిన విధంగా ఇంటిని కట్టుకోవచ్చని వివరించారు.స్థానికంగా ఉంటేనే అర్హులుగా ఎంపిక చేయాలన్నారు.

దరఖాస్తుల ను గ్రామ, మున్సిపాలిటీ పరిధిలోనీ వార్డులలో క్షుణ్ణంగా పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేసామనీ చెప్పారు.

లబ్దిదారులకు ఆహార భద్రత కార్డ్ ఉండాలని చెప్పారు.

ఇప్పటికే ఆర్సీసీ రూఫ్ ఇల్లు ఉన్నవారు.జీవో.59 కింద లబ్దిపొందినవారు, ప్రాసెస్ లో ఉన్న అర్హులు కారని స్పష్టంచేశారు.దళిత బంధు, ఎంబిసి గ్రాంట్ పొందిన వారు మొదటి ప్రాధాన్యత జాబితాలో ఎంపిక చేయవద్దని చెప్పారు.

బృందాలు వెంటనే వెరిఫికేషన్ చేపట్టి ఈ నెల 20వ తేదీ నాటికి విచారణ పూర్తిచేయాలని ఆదేశించారు.ప్రక్రియ పారదర్శకంగా, పొరపాట్లకు, మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.

జాబితాలో ఏ ఒక్కరైనా తప్పు గా ఎంపిక చేసినట్లు ఆరోపణలు వస్తే బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గృహాలక్ష్మి పథకం కు అర్హులు గా గుర్తించిన వారికి సంబంధించి ఫోటోగ్రఫీ, జియో కో ఆర్డినేట్స్ తీసుకోవాలని చెప్పారు.

అర్హుల జాబితాలోని ఇండ్లు లేని, గుంట కూడా భూమిలేని , కచ్చా , గుడిసె లో నివసిస్తున్న అత్యంత పేదలను మాత్రమే మొదటి ప్రాధాన్యత కింద మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.అర్హుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించాలన్నారు.

వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో సమన్వయం చేస్తారన్నారు.తెలంగాణ కు హరిత హరం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు ఈ విడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ గౌతమ్ రెడ్డి( CEO Gautham Reddy ), జిల్లా పంచాయితీ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube