ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ప్రతిరోజూ చేసే వ్యాయామాని( Exercise )కి దూరంగా ఉంటున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు దీనివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే రోజుకు కనీసం అరగంటైనా నడవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ మధ్య కాలంలో అమెరికా, మెక్సికో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంకా చెప్పాలంటే చాలా మంది ప్రజలు వ్యాయామంలో భాగంగా మధ్య వయసులో పరిగెత్తడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపక శక్తి ( Memory )సమస్యలు దూరం అయిపోతున్నాయని పరిశోధకులు వెల్లడించారు.యవ్వన దశలోకి వచ్చాక కొత్తగా ఏర్పడే నాడి కణాలను కీలకం నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది అని వెల్లడించారు.వయసు పెరిగే కొద్దీ ఎపిసోడిక్ మెమరీ నిర్వహణకు ఈ నెట్‌వర్క్ ఎంతో ఉపయోగపడుతుందని కూడా తెలిపారు.

ముఖ్యంగా చెప్పాలంటే వృద్యాప్యం వల్ల విషయ గ్రహణ సామర్థ్యం తగ్గుతుందని, మెదడు( Brain )లోనీ హిప్పోక్యాంపల్ పరిమాణంలో మార్పులు ఇందుకు కారణం అని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాగే వార్ధక్యం వల్ల మెదడులోని పెరిహైనల్, ఎంట్రోహైనల్ కార్టెక్స్ నుంచి హిప్పోక్యాంపస్‌కు వచ్చే సమాచారం క్షీణించడం వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని వెల్లడించారు.దీర్ఘకాలిక పరుగుల వల్ల యవ్వనంలో వచ్చే న్యూరాన్లు పెరగడంతో పాటు పెరిగిన పెరిహైనల్ సంధానతలు బలోపేతమవుతున్నట్లు వెల్లడించారు.
ఫలితంగా వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపకశక్తి క్షీణతను ఇవి దూరం చేస్తున్నట్లు తెలిపారు.అందుకోసం ప్రతి రోజు 30 నిమిషాల పాటు నడకా లేదా పరిగెత్తడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.