టీడీపీ చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు.
అబద్ధపు హామీలతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలె ఇచ్చి నెరవేర్చలేదని తెలిపారు.ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే అధికారం అని తేల్చి చెప్పారు.వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని అమలు చేసిందన్నారు.ఇప్పటివరకు 98 శాతం హామీలు నెరవేర్చామని స్పష్టం చేశారు.







