దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి ( Saipallavi ) ఎంతో అద్భుతమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొనిప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇలా సాయి పల్లవి తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి.
నటన పై ఏమాత్రం ఆసక్తి లేకపోయినా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన సాయి పల్లవి అనంతరం ప్రేమమ్( Premam ) సినిమా ద్వారా హీరోయిన్గా అవకాశాన్ని అందుకున్నారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
ఇలా తమిళం మలయాళం తెలుగు భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ సాయి పల్లవి ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక సాయి పల్లవి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటారు.స్టార్ హీరోల సినిమాలు అయినా కథకు ప్రాధాన్యత లేకపోతే నిర్మొహమాటంగా ఈమె ఆ సినిమాని రిజెక్ట్ చేస్తుంటారు.ఇలా మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాయి పల్లవి దాదాపు ఏడాదిపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండడమే కాకుండా కొత్త సినిమాలను కూడా ఏమీ ప్రకటించకపోవడంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెబుతూ తన వైద్య వృత్తిలో స్థిరపడతారని అందరూ భావించారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి సంవత్సరం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వడానికి గల కారణాలను తెలియజేశారు.తనకి సినిమాలలో గ్యాప్ రాలేదని తానే తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక చివరికి ఈమె రానా ( Rana ) తో కలిసిన నటించిన విరాటపర్వం ( Virataparvam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అనంతరం తమిళంలో నటించిన గార్గి( Gargi ) సినిమాని తెలుగులో విడుదల చేశారు.
ఇదే ఈమెకు ఆఖరి చిత్రం తాజాగా కమల్ హాసన్( Kamal Hassan ) నిర్మిస్తున్న చిత్రంలో ఈమె శివకార్తికేయన్(Shiva Karthikeyan) తో కలిసి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.







