పుచ్చకాయపై మోడీ - కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ ప్రతిభ

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతదేశ ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఓ కార్వింగ్ కళాకారుడు పుచ్చకాయపై నరేంద్ర మోడీని కార్వింగ్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు, ఆర్టిస్టు శ్యామంతుల అనిల్ పుచ్చకాయపై 30 నిమిషాల వ్యవధిలో నరేంద్ర మోడీని చెక్కడం జరిగిందని పేర్కొన్నారు.

 Modi Portrait On Watermelon By Carving Artist Shyamanthula Anil, Modi Portrait ,-TeluguStop.com

గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా పుచ్చకాయపై కార్వింగ్ చేయడం జరిగిందని అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిమలతో పాటు , మహనీయులు మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలను కూడా కార్వింగ్ చేయడం జరిగిందని వివరించారు.

అదేవిధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ట చేసిన సందర్భంగా రామ మందిరాన్ని, శివరాత్రి పండుగ సందర్భంగా శివున్ని, వినాయక చవితి సందర్భంగా మహాగణపతిని, క్రిస్మస్ వేడుక సందర్భంగా

శాంతా క్లాస్, భారత జవాన్ అభినందన్,

క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ , ఇలా అనేక చిత్రాలను పుచ్చకాయ, గుమ్మడికాయ పై చిత్రాలను కార్వింగ్ చేయడం జరిగిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube