కుర్చీ మడతబెట్టి సాంగ్ తో మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్.. బాబుకు తిరుగులేదుగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) శ్రీ లీల( Sreeleela ) కలిసి నటించిన గుంటూరు కారం.( Guntur Kaaram ) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 270 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.

 Guntur Kaaram Kurchi Madatha Petti Crossed Another Record In Mahesh Details, Gun-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి.మరి ముఖ్యంగా గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి( Kurchi Madatha Petti Song ) అనే సాంగ్ బాగా వైరల్ అయింది.

అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

ఒక్క యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు ఈ పాటు మారు మోగిపోయింది.కుర్చీ మడతబెట్టి అనే ఒక వైరల్ పదం తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా థమన్( Thaman ) ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్, శ్రీలీల, మహేష్ సినిమాలో వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.థియేటర్స్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ ను అందుకుంది.

తెలుగు నుంచి ఫాస్టెస్ట్ 100 మిలియన్ నుంచి 200 మిలియన్ వ్యూస్ ఉన్న సాంగ్స్ లో ఒకటిగా అదిరే రెస్పాన్స్ తో దూసుకెళ్లగా ఇప్పుడు 2 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి మహేష్ ఖాతాలో ఇంకో రికార్డ్ అందించింది.ఇక దీనితో పాటుగా సాంగ్ ఇప్పుడు 300 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తూ అన్ స్టాపబుల్ గా ఉందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube