విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

విద్యార్థుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని గీత నగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Special Attention Should Be Given To Students And Quality Education District Col-TeluguStop.com

ఈ సందర్భగా 8,9,10 తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు , గణితం, బౌతిక శాస్త్రాలను బోధించారు.విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థులకు గణితం, ఆంగ్లం సబ్జెక్ట్ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయురాలని ఆదేశించారు.

ఇప్పటినుండి 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుండి పదవ తరగతి సిలబస్ పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తయారీ విధానమును స్టోర్ రూమ్ లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెనూ ప్రకారం అందించాలని పేర్కోన్నారు.పాటశాల ఆవరణలోని బాలుర టాయిలెట్లను, పరిసరాలను స్వయంగా పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలిపారు.

పాఠశాలలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకుని హాజరు పట్టిక మరియు సాధారణ సెలవు రిజిస్టర్ లను పరిశీలించినారు.ముందస్తు సమాచారం లేకుండా, సెలవు దరఖాస్తు ఇవ్వకుండా గైర్హాజరైన ఉపాధ్యాయుల పై చర్యలకు డి.ఈ.ఓ ఆదేశాలు జారీ చేసారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube