అంగన్వాడీ బడి అంటే అమ్మఒడి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క

రాజన్న సిరిసిల్ల జిల్లా :మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డి సీతక్క( Minister Seethakka ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు.ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున చేపట్టిన పలు కార్యక్రమాలను సమీక్షించారు.

 Anganwadi Badi Means Ammaodi Minister Seethakka In Video Conference ,minister S-TeluguStop.com

దీనిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో భద్రత ఇస్తాం-పౌష్టికాహారం ఇస్తాం; సంరక్షణ చేస్తాం -భవిష్యత్ ఇస్తాం అని ప్రతి టీచర్ ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి భరోసాను ఇస్తూ పిల్లలని అమ్మబడి లాగా అంగన్వాడి కేంద్రం లో చేర్పించాలని సూచించారు.అంగన్వాడీ సృజనాత్మకత వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని వివరించాలని తెలియజేశారు… అలాగే మన కేంద్రానికి ఎక్కువ మంది మహిళలు వస్తారని వారికి పౌష్టికాహారం అందించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు.

దీనిలో భాగంగా సరియైన పరిమాణంలో నాణ్యతతో కూడిన సరుకులు ఇవ్వాలని సూచించారు.ఒకవేళ కాంట్రాక్టర్లు ఎవరైనా సరైన ఆహార పదార్థాలు/వస్తువులు సరఫరా చేయకపోతే అంగన్వాడీ టీచర్ ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోకూడదని వాటిని తిరస్కరిస్తున్నట్టు పై అధికారులకు తెలియజేయాలని సూచించారు.

వారికి సంబంధిత అంగన్వాడీ టీచర్ బయోమెట్రిక్ వేయవద్దని తెలిపారు.అలాగే వచ్చే సోమవారం నుండి వారం రోజులపాటు అంగన్వాడి బాట నిర్వహించాలని ఆదేశిచారు.

మాతా శిశు సంరక్షణకు, ఆరోగ్య సంరక్షణకు, వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలలో అంగన్వాడీ టీచర్లు ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు.జిల్లాలో జరుగుతున్న గ్రోత్ మానిటరింగ్ పై అంగన్వాడీ కేంద్రాలలో సమయపాలన గురించి సరుకులు ఎలా ఇస్తున్నారు సరైన నాణ్యతలో ఇస్తున్నారా అందరి సమయపాలన పాటిస్తున్నారా తనిఖీలు చేస్తున్నారా తనిఖీల యొక్క నివేదికలు ఎలా ఉన్నాయి అని ఆరా తీశారు.

తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి ప్రతి టీచర్ కి మార్గదర్శనం చేయాలని సూచించారు.వీడియో కాన్పరెన్స్ కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం, వేములవాడ అడిషనల్ సిడిపిఓ సుచరిత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube