క్రీడలపై ఆసక్తి, నైపుణ్యం పెంచేలా ప్రణాళికలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: యువతకు క్రీడలపై ఆసక్తి, నైపుణ్యం పెంచేలా  రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.యువతను ప్రేరేపించి, క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టార్చ్ రిలే రాలీని రాష్ట్రవ్యాప్తంగా ఈ  నెల 03వ తేదీన హైదరాబాద్ లోని  ఎల్ బి.

 Plans To Increase Interest And Skill In Sports, Rajanna Sirisilla District ,aad-TeluguStop.com

స్టేడియంలో ప్రారంభించగా, జిల్లా కేంద్రానికి మంగళవారం చేరుకోగా, సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి జెండా ఊపి సీఎం కప్ టార్చ్ రాలీని ప్రారంభించారు.గాంధీ చౌక్ దాకా కొనసాగించారు.

అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas) మాట్లాడారు.యువత జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి, పతకాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ఒలింపిక్స్ లో స్వర్ణం ఇతర పతకాలు సాధించేలా శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని తెలిపారు.యూనివర్సిటీ ఏర్పాటు చేసి, దానికి శివసేన రెడ్డిని నియమించారని పేర్కొన్నారు.

యువతకు క్రీడల పై ఆసక్తి, నైపుణ్యం పెంచేలా ముందుకు వెళ్తున్నామని వివరించారు.ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలు ఇస్తున్నదని తెలిపారు.

క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దారుడ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.యువత పెడదారి పట్టకుండా గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపు ఇచ్చారు.

స్టేడియం పూర్తి చేస్తాంవేములవాడ( Vemulawada) లో స్టేడియం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.తాను ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత ముందుగా మండల కేంద్రాల్లో ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు నిధులు ఇచ్చానని గుర్తు చేశారు.

రెండో దశలో గ్రామాల్లో, మూడో దశలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.జిల్లాలో  క్రీడల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్, యువతి యువకులు, ప్రజలు , తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube