యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్రంలో అన్నిశాఖలలో ఉన్న 2700ల రికార్డ్ అసిస్టెంట్లకు కొత్త రెవిన్యూ చట్టంలో గ్రామ రెవిన్యూ అధికారిగా (జెఆర్వో, విఆర్ఎస్)లుగా అవకాశం కల్పించాలని రికార్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి వీరన్న ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి గ్రామంలో విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న తమకు శాఖాపరమైన అవగాహన ఉన్నందున
గత ప్రభుత్వంలో ఇంటర్ విద్య అర్హతతో విఆర్వో లుగా ప్రమోషన్ కల్పించారన్నారు.
నేడు డిగ్రీ అర్హత పెట్టడం వలన, రికార్డ్ అసిస్టెంట్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి,రికార్డ్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు చిత్తలూరి స్వామి, బుంగ చరణ్ రాజ్,ఈదుల బాలస్వామి, బాదే భాస్కర్,భైరబోయిన మల్లేష్,సంగెం పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు
.