వీధి పందుల బెడద నుంచి పంటలను కాపాడండి

సూర్యాపేట జిల్లా:వీధి పందుల బెడద నుంచి పంటలను కాపాడి తమను ఆదుకోవాలని జిల్లా కేంద్రంలోని గిరినగర్ కు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఆరో వార్డు గిరినగర్ లో ప్రాంతంలో సర్వేనెంబర్ 44,45 లో వరి పంట సాగు చేశామని, తీర కోతకొచ్చే సమయంలో ప్రతిరోజు 20 నుంచి 30 కి పైగా వీధి పందులు గుంపులుగా వస్తూ పంటను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 Protect Crops From The Menace Of Stray Pigs, Protect Crops , Menace ,stray Pigs,-TeluguStop.com

ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు అధికంగా ఉండడంతో పందులు నిత్యం స్వైర విహారం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఎదురుదాడికి పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయని వాపోయారు.

ఇదే విషయమై మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.ఇప్పటికైనా స్పందించి పందుల బెడద నుండి వరి పంటను రక్షించి ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతులు నరసింహ,రమణ,డానియల్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube