Suryapet : అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

ఆత్మకూర్ (ఎస్)మండల పరిధి( Atmakur Mandal )లోని ఏపూర్ గ్రామంలో యేటి నుండి గత 15 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక దందా( Illegal Sand Scam ) కొనసాగుతుందని స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నామమాత్రపు కేసులు చేసి, ఏపూర్ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్లు పోకుండా పోలీసులు గాతులు తవ్వించారు.ఇక అప్పటి నుండి పగలు ఇసుక తరలింపు మానేసిన ఇసుకాసురులు రాత్రి వేళల్లో ఏపూర్ నుండి లింగంపల్లి మీదుగా ఇసుకను తరలిస్తున్నారు.

 Villagers Stopped Illegal Movement Of Sand-TeluguStop.com

స్థానికులు పోలీసులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులే( Villagers ) రంగంలోకి దిగి సోమవారం రాత్రి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు.ఈ సందర్భంగా ఇసుకాసురులకు గ్రామస్తులకు ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఒక దశలో అక్రమార్కులు గ్రామస్తులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఇసుక కూలీలుగా ఏపూర్ గ్రామస్తులే ఉండడంతో సమాచారం పోతుందని భావించిన ఇసుక మాఫియా లింగంపల్లి నుండి కూలీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇసుక అక్రమ తరలింపులో అధికార పార్టీకి చెందిన ట్రాక్టర్లు( Tractors ) ఉండడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఇసుక దందాను అరికట్టలేకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిస్థితి చెయ్యి దాటక ముందే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube